‘నా ఫ్రెండ్, నా ప్రపంచం’ అంతా నమ్రత : సూపర్ స్టార్ మహేష్ బాబు

mahesh-babu-wishes-his-world-namrata-on-friendship-day-with-adorable-post

స్నేహితుల దినోత్సవం సందర్బంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పాత పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదే.. మహేష్, నమ్రత లు కలిసి ఉన్న ఫోటో. ఆ ఫోటోకు ‘మై ఫ్రెండ్, మై వరల్డ్ నమ్రత’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోటోకు 2500 లైకులు, 1000 రీట్వీట్లు రావడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో కలిసి నటించినప్పుడు మహేష్ బాబు,నమ్రతా లు స్నేహితులయ్యారు. ఆ తరువాత కలిసి జీవితాన్ని పంచుకున్నారు. వారికీ గౌతమ్, సితార ఇద్దరు సంతానం. ప్రస్తుతం మహేష్ బాబు వంశి పైడిపల్లి దర్శకత్వంలో తన 25 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లోగోను మహేష్ బాబు కూతురు సితార, వంశి పైడిపల్లి కూతురు ఆధ్య సంయుక్తంగా ఆవిష్కరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.