రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సామూహిక భజన కార్యక్రమాలు

Marathas protest for reservation again

ప్రత్యేక రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. ధూలేలో ఎంపీ మీనా గవిట్‌ కారును ఆందోళన కారులు అడ్డుకున్నారు. కదులుతుండగానే ఆమె కారుపై ఎక్కడంతో… ఎంపీ పరుగుపరుగున అందులో నుంచి బయటికొచ్చేశారు. అనంతరం స్థానిక కూడలిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు….

ఇక అటు వాషిం జిల్లాలో మరాఠాలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని…రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సర్కారు వైఖరికి నిరసనగా.. సామూహిక శిరోముండనం చేయించుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు..

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -