వందల కోట్ల లాటరీ తగిలింది.. టికెట్ పోయింది.. అయినా అద్భుతం..

scottish-couple-win-£58m-lottery-jackpot-despite-ripped-ticket

ఏదైనా విలువైన వస్తువు పోయి తిరిగి దొరికితే.. వచ్చే ఆనందమే వేరు..అలాంటిదే జరిగింది స్కాట్లాండ్ లో. స్కాట్లాండ్ దంపతులైన 57 ఏళ్ల ఫ్రెడ్, 67 ఏళ్ల లెస్లీ హిగిన్స్‌లు ‘లైఫ్‌ చేంజింగ్‌’ లాటరీ టికెట్‌ను కొనుక్కున్నారు. దాంతో ఇటీవల ప్రకటించిన లాటరీలో తమ నంబర్ ఉందొ లేదో కనుక్కోవడానికి సదరు లాటరీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ఈ నెంబర్ లాటరీలో లేదని సమాధానమిస్తూ.. దాన్ని చెత్త బుట్టలో పడేశారు. కానీ వారికీ ఎందుకో అనుమానం వచ్చి సరిగా చూడకుండానే ఆ లాటరీ టికెట్‌ చించిపడేశారనీ ఆరోపిస్తూ సహాయ కేంద్రంలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి టికెట్ వెతికారు. అంతేకాదు టికెట్ నంబర్ ను నిశితంగా పరిశీలిస్తే డ్రాలో హిగిన్స్‌ నంబర్‌ ఉందని తేలింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు.. రూ.461 కోట్లు. జీవితంలో చూడనంత మొత్తాన్ని గెలుచుకోవడంతో ఆ దంపతులు ఎగిరి గంతేశారు.