పెట్రోల్ పోసుకుని నిప్పుపెట్టుకుంటానంటూ దివ్యాంగుడి సెల్ఫీ వీడియో

selfie video, handicapped selfie video

సోషల్ మీడియాలో దివ్యాంగుడి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ, పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం వడ్లూరుకు చెందిన శివరావు ఈ వీడియో పోస్ట్ చేశాడు. వడ్లూరు జన్మభూమి కమిటీ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2014లోనే ఇంటి కోసం అప్లై చేసుకున్నా, ఏవో కారణాలతో తనకు రుణం రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నాడు. సాయంత్రం లోపు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసి నిప్పుపెట్టుకుంటానని హెచ్చరిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఈ వీడియో పోస్ట్ చేసిన శివరావు.. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో.. కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. శివరావు ఎక్కడున్నాడో ఆచూకీ కనిపెట్టాలని పోలీసుల్ని వేడుకుంటున్నారు.