విద్యార్థినీల పట్ల కీచకుడిగా మారిన టీచర్

teacher-herrased-students-in-nellore-balayapalli

విద్యా బుద్దులు నేర్పాల్సిన టీచరే దారి తప్పాడు. కీచకుడిగా మారి 4,5 వ తరగతి విద్యార్ధినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాలికలపై లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెడ్ మాస్టర్ గౌరబత్తిన ప్రసాద్ వికృత చేష్టలతో విసిగిపోయిన విద్యార్ధినిలు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు బాలాయపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక టీచర్ పై కేసు నమోదు చేశారు. బాలాయపల్లి ఎమ్మార్వో స్కూల్ వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. తదుపరి ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారుకు పంపి..శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.