హైదరాబాద్, పాలమూరులో టీఆర్ఎస్ కు దడపుట్టిస్తోంది వీళ్లే!

trs, kcr

టీఆర్ఎస్ వందసీట్లు గెలవడం లక్ష్యమంటోంది. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయంటూ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రతిపక్ష సభ్యులున్న ఎమ్మెల్యే స్థానాల్లో మంత్రులు, ఎంపీలు సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ఆ స్థానాలను కైవసం చేసుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలను ఢీకొట్టే గెలుపు గుర్రాలెవరనేదే ఇప్పుడు టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. గెలుపు గుర్రాల అన్వేషణలో గులాబీ బాస్ నిమగ్నమయ్యారు. గ్రూపు తగాదాలు, వర్గపోరు, బలమైన నేత లేకపోవడం మైనస్ గా మారిన ఈ నియోజకవర్గాలను టీఆర్ఎస్ ఎలా డీల్ చేయబోతోంది?

మహబూబూనగర్ జిల్లాలో గద్వాల నుంచి డీకే అరుణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో క్రిష్టారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి క్రిష్టారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల జరిగిన సభలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే గతంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన గట్టుభీముడు టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారు. గద్వాల సభలో తమను పట్టించుకోలేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు, అటు బీసీ కమిషన్ సభ్యుడు అంజనేయులు సైతం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ మూడు గ్రూపులుగా తయారైంది టీఆర్ఎస్ రాజకీయం. ఇక ఆలంపూర్ నుంచి సంపత్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మందా జగన్నాథం కుమారుడు శ్రీనాధ్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మందా జగన్నాథంను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా నియమించారు. అటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం టీఆర్ఎస్ లో చేరారు. టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో క్లారిటీ లేదు. వనపర్తి నుంచి చిన్నారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ నిరంజన్ రెడ్డి గతఎన్నికలో పోటీ చేశారు. ఈసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

ఇక కల్వకుర్తిలో వంశీచంద్ గెలవగా ద్వితీయ స్థానంలో బీజేపీ నిలిచింది. టీఆర్ఎస్ లో ఎడ్మకిష్టారెడ్డి ఇటీవల పార్టీలో చేరారు. అటు ఇంఛార్జ్ గా జైపాల్ యాదవ్ ఉన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం రేసులో ఉన్నారు. ముగ్గురూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో మూడోస్థానంతో సరిపెట్టుకున్న టీఆర్ఎస్ ఈసారి గెలుపుకోసం ట్రై చేస్తోంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోచేరి మరోసారి గెలిచేందుకు రెడీ అయ్యారు. ఆయన్ని ఓడించేందుకు మంత్రి మహేందర్ రెడ్డి సోదరులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే టీఆర్ఎస్ నుంచి ఓడిన గుర్నాధ్ రెడ్డి.. మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు. ఇక్కడ వర్గపోరు తప్పేలా లేదు.

హైదరాబాద్ పరిధిలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న అంబర్ పేట, ఉప్పల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, గోషామహల్ లో దీటైన అభ్యర్దులు కోసం టీఆర్ఎస్ వెదుకుతోంది. ఖైరతాబాద్ నుంచి ఓడిన దానం నాగేందర్ ను టీఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. అక్కడ మన్నె గోవర్దన్ రెడ్డి ఇంఛార్జ్ టికెట్ ఆశిస్తు్న్నారు. పీజేఆర్ కూతురు సైతం రేసులో ఉన్నానంటున్నారు. ఉప్పల్ లో మేయర్ బొంతు రామ్మెహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. గోషా మహల్ నుంచి ప్రేమ్ సింగ్ రాధోడ్ రేసులో ఉండగా.. ముఖేశ్ గౌడ్ దోబూచులాడుతున్నారు. అంబర్ పేటలో దీటైన అభ్యర్ది కోసం వెతుకుతున్నారు. ఇక ముషీరాబాద్ నుంచి మంత్రి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా పోటీకి రెడి అంటున్నారు దానం నాగేందర్. విపక్ష ఎమ్మెల్యేలను ఢీకొట్టేందుకు టీఆర్ఎస్ కు దీటైన్ అభ్యర్దుల ఎంపిక సవాల్ గా మారింది.

– మార్గం శ్రీనివాస్

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.