అభిమానం.. అతడ్ని చంపేసింది..

a-fan-dies-at-dulquer-salmaan-event-in-kerala

వెండితెరపై వెలుగులుజిమ్మే తారలు జనాల మధ్యకు వస్తే వారి ఆనందానికి అవధులుండవు. ఒక్కసారైనా తమ అభిమాన హీరోని తనివి తీరా చూడాలని అనుకుంటారు. కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిధిగా వచ్చాడు. దుల్కర్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమాన గణం వెల్లువెత్తింది. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులను వారించడం, అదుపు చేయడం పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి కష్టంగా మారింది.

a-fan-dies-at-dulquer-salmaan-event-in-kerala

ఈ క్రమంలోనే తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. దీంతో తిరువనంతపురంకు చెందిన హరి అనే వ్యక్తి జరిగిన తోపులాటలో కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించాడని నిర్థారించారు. గుండెపోటు కారణంగా మరణించాడని కొందరు అంటుండగా, తొక్కిసలాటలో కిందపడి మరణించాడని మరికొంత మంది స్థానికులు చెబుతున్నారు.