భార్యపై కోపంతో ముగ్గురు పిల్లల్ని నదిలో విసిరిన తండ్రి

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నీవా నదిలో ముగ్గురు పసిపిల్లల డెడ్‌బాడీలు దొరకడం కలకలం రేపింది. రాత్రి పది గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా, భార్యపై కోపంతో ఉన్న వెంకటేష్..‌ పిల్లల్ని తీసుకెళ్లి నదిలో పడేశాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి, వారించేలోపే ఘోరం జరిగిపోయింది. తండ్రి అరాచకానికి బలైన చిన్నారుల్లో పెదబాబు రాహుల్‌కి 10 ఏళ్ల వయసు. మిగతా ఇద్దరూ ఆరు, మూడేళ్ల వయసువాళ్లే. ఉదయాన్నే పిల్లల డెడ్‌బాడీలు బయటకు తీసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గంగాధర నెల్లూరు మండలం శెట్టిగారిపల్లెలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వెంకటేష్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఆముదకు పిల్లలు లేరన్న కారణంతో.. అమరావతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వేరే ఊరిలో కాపురం పెట్టిన వెంకటేష్‌ ఇటీవలే మళ్లీ సొంత ఊరికి వచ్చాడు. ఈ సమయంలో తలెత్తిన విభేదాల కారణంగా పిల్లలు ముగ్గురినీ చంపేశాడు.