ప్లిప్‌కార్ట్‌లో ఫ్రీడం సేల్.. బోలెడన్ని ఆఫర్లు.. పోటీగా అమెజాన్ కూడా..

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిగ్ సేల్‌ను ప్లిప్‌కార్డ్ ప్రారంభించనుంది. ఈ సేల్ ఈ నెల 10 నుంచి 12 వరకు అంటే రెండు రోజులు మాత్రమే నిర్వహించనున్నట్లు ప్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈసేల్‌లో ఏఏ వస్తువులుంటాయనేది మాత్రం రివీల్ చేయలేదు. వినియోగదారులను సస్పెన్స్‌‌కు గురిచేసింది. 72 గంటల ఈ సేల్‌లో బ్లాక్ బస్టర్ డీల్స్‌ను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను, రష్ అవర్ డీల్స్ ఉన్నాయని తెలిపింది. గంట గంటకు వినియోగదారులను ఊరించే సేల్స్ ఉంటాయంటోంది.

ఆగస్టు 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు రష్ అవర్ ఉంటుందని తెలియజేసింది. పలు రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమెరాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండవచ్చని సమాచారం. ఇక ప్లిప్‌కార్ట్ కంటే ఒకరోజు ముందుగానే అమెజాన్ కూడా ఫ్రీడం సేల్‌ను ప్రారంభిస్తోంది. ఈ సేల్ ఈనెల 9 నుంచి 12 వరకు ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లపై డీల్స్‌ను, క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.