9/11 హైజాకర్ కుమార్తెతో లాడెన్ కొడుకు పెళ్లి..

hamza-bin-laden-marries-daughter-of-911-hijacker-mohammed-atta

అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల సూత్రదారి ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం చేసుకున్నాడు. హైజాకర్ మహ్మద్ అట్టా కుమార్తెతో హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా లాడెన్ కుటుంబసభ్యులు  ‘ది గార్డియన్’ దిన పత్రికకు ఇచ్చిన ఇంటార్య్వూలో తెలిపారు. అమెరికాపై జరిగిన 9/11 దాడులకు నాయకత్వం వహించిన మహ్మద్ అట్టా కూతురిని హంజా వివాహం చేసుకున్నాడని వారు స్పష్టం చేశారు. మరోవైపు హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు లేవని లాడెన్ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. అల్ ఖైదా ద్వారా ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని తాము కోరినట్లుగా వారు చెబుతున్నారు. ఇదిలావుంటే హంజాను పట్టుకునేందుకు పలు నిఘా విభాగాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. హంజా ఆచూకీని రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. అయితే హంజా అఫ్గానిస్తాన్ లో ఉన్నట్లుగా అమెరికా సహా పలు నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -