రేపు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలు బంద్‌

transport-strike-called-off-after-govt-assurances

రేపు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలు స్తంభించనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీతో పాటు ఆటోలు, క్యాబ్‌లు, లారీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌.. దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో అన్ని రవాణా వ్యవస్థలు పాల్గొననున్నాయి. పెంచిన థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ను తగ్గించాలని, టోల్‌గేట్ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు కల్పించాలని, కార్మికులకు కనీసవేతనంగా 24వేలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌.. ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -