ఆవుపై 80 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి?

cow, old man, cow raped

పేరుకి పెద్దాయన.. వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు.. 80 ఏళ్ల ఉన్న ఈ వ‌ృద్ధుడు మనిషి కాదు మృగాడు. తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం రాక్షస ప్రవృత్తిని బయటపెట్టాడని, ఆవుపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా ప్రాంత వాసులు.

వృద్ధుడి లైంగిక దాడితో ఆవు మృత్యువాత పడిందని ఆవు యజమాని వాపోతున్నాడు. దీంతో ఆగ్రహానికి గుర్తెన ఆ ప్రాంత ప్రజలు రోడ్డు మీద బైటాయించి ట్రాఫిక్‌ని నిలిపి వేశారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే ఆ వృద్ధుడిపై వచ్చిన ఆరోపణలు నిజం కావని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూవివాదాల కారణంగానే ఈ కేసులో ఇరికించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు నిజనిజాలు నిర్ధారించవలసి ఉంది.