నడిరోడ్డుపై భారీ గుంత

రోడ్డుపై వెళుతున్న కార్లు అకస్మాత్తుగా భారీ గుంతలో పడిపోయాయి. రోడ్డు ఉన్నట్టుండి అకస్మాత్తుగా కుంగిపోయి ఒకసారిగా భారీ గుంత ఏర్పడింది.ఈ ఘటన ఈశాన్య చైనాలోని హార్బిన్‌ నగరంలో చోటుచేసుకుంది. చైనాలో కురిసిన భారీ వర్షాల కారణంగా భూమి కుంగిపోయి భారీ గుంత పడినట్లు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. భూమి కుంగిపోతున్న సమయంలో అటుగా వెళ్తున్నరెండు కార్లు గుంతలో పడిపోయాయి.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు.