బీచ్‌లో రాకాసి జెల్లీఫిష్‌లు

blue-bottle-jellyfishes-injure-many-at-mumbai-beaches

ముంబై బీచ్‌లో రాకాసి జెల్లీఫిష్‌లు సంచరిస్తూ పర్యాటకుల్ని భయపెడుతున్నాయి. బీచ్ అందాల్ని ఆస్వాదిస్తూ, సాయింత్రాలను సముద్ర తీరంలో సేద తీరాలనుకునే ముంబై వాసులు జెల్లీ ఫిష్‌లను చూసి వణికిపోతున్నారు. జూహూ బీచ్‌లో గత రెండు రోజులుగా 150 మంది వీటి దాడుల్లో గాయపడ్డారు. చూడడానికి చాలా అందంగా ఉన్న ఈ బ్లూ బాటిల్ జెల్లీ ఫిష్ విషపూరితమైనవి. అందుకే రాకాసి జెల్లీఫిష్‌లని వీటికి పేరు.

blue-bottle-jellyfishes-injure-many-at-mumbai-beaches

అయితే ఇవి మనుషుల్ని చంపేంత ప్రమాదకరమైనవి కాదని చేపలను చంపడానికి మాత్రమే విషాన్ని చిమ్ముతాయని అధికారులు అంటున్నారు. మనుషుల్ని కరిచినప్పుడు కొద్ది గంటల పాటు నొప్పి విపరీతంగా ఉంటుందని అంటున్నారు. ప్రమాదం లేదుకదా అని వాటి దగ్గరకు వెళ్లే సాహసం చేయొద్దంటున్నారు. ప్రతి ఏటా జెల్లీ ఫిష్‌లో బీచ్ సంచరిస్తున్నా ఈసారి అవి ఎక్కువ సంఖ్యలో కనబడుతున్నాయని అంటున్నారు బీచ్
చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -