విజయ్ దేవరకొండకు మెగాస్టార్ సర్‌ప్రైజ్‌

రౌడి ఫ్రస్ట్రేషన్ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో యమా క్రేజ్ ఉంది. సాధారణ అభిమానులే కాదు స్టార్‌లు కూడా అతని నటన చూసి ఫిధా అవుతున్నారు. త్వరలో విజయ్‌ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో పేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రీ రిలీజ్‌ వేడుకను విశాఖలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విజయ్‌కి “చిరు”;
సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌లో రూపుదిద్దుకుంది.కావునా అల్లు అరవింద్..చిరును ఈ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.