భార్యపై దాడి చేసి.. ఆపై ఆత్మహత్య

husband-attacked-wife-knife-kethepally

అనుమానం పెనుభూతమైంది. ఆ కారణంగా కట్టుకున్న భార్యపై దాడి చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడోవ్యక్తి . ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన జాతంగి శ్రీనివాస్‌(35)కు 13 ఏళ్ల కిందట రజిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య కలతలు వచ్చాయి. అనుమానంతో భార్యను వేధించడం మొదలుపెట్టాడు శ్రీనివాస్. రజిత మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందన్నఅనుమానంతో మనగలవారం ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆపై అతను కూడా కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలతో రజిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.