ప్రియ శత్రువుకి శాశ్వతంగా వీడ్కోలు పలికిన కరుణ

karunanidhi pays tribute to jayalalitha

తమిళ రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య తీవ్రమైన పోటీ నడిచేది. ఎంజీఆర్‌ హయాం వరకూ ఈ పోటీ రాజకీయానికే పరిమితమైనా.. జయలలిత పగ్గాలు పట్టిన తర్వాత మాత్రం వ్యక్తిగత పగ, ప్రతీకారాలకు దారి తీసింది. 2001లో జయలలిత గెలిచిన తర్వాత కరుణానిధిని అర్ధరాత్రి జైల్లోకి నెట్టించారు. డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జయను అదే జైలుకి పంపించేదాకా కరుణానిధి శాంతించలేదు. ఆ తర్వాత వయసు మీద పడటంతో జయలలితతో తన వైరాన్ని కాస్త సడలించుకున్నారు. జయ మరణం తర్వాత ఆమెపై కవిత రాసిన కరుణానిధి… తన ప్రియ శత్రువుకి శాశ్వతంగా వీడ్కోలు పలికారు.