కాళ్లు లేకపోయినా.. కమ్మని కంఠం.. ఆమెలా కూడా..

అంగవైకల్యాన్ని తన మధురమైన కంఠంతో జయించాడు. పుట్టుకతోనే లోపం, ఎదుగుతున్న కొద్దీ తను తల్లిదండ్రులకు భారం కాకూడదనే హృదయ సంకల్పం. దేవుడు ఒక తలుపు మూసేసినా మరో తలుపు తెరిచే ఉంచుతాడనేదానికి నిదర్శనం. తనలోని లోపానికి తనే బాధ్యుడినని సర్థిచెప్పుకుని, ఎవర్నీ నిందించకుండా తన గొంతు సవరించాడు.

ఆ గొంతులో అద్భుతమైనా రాగాలు పలికించాడు. ఒకేసారి ఆడ, మగ గొంతులతో పాట పాడి ప్రేక్షకుల్ని మైమరపిస్తున్నాడు. చూసేవారికి ఏదో మాయచేస్తున్నాడన్న అనుభూతిని కలిగిస్తున్నాడు. నిజంకాదేమోనన్న ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తనకి దేవుడు ఇచ్చిన అరుదైన బహుమతినే ఆదాయ మార్గంగా మలచుకుని తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -