ఎన్ఐఏ విచారణకు పలువురు ఉగ్ర అనుమానితులు

ఐసిస్‌ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న ఏడుగురు సభ్యులను NIA నిశితంగా ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2016 లో ఢిల్లీలో నమోదైన ఓ కేసులో నిందితులతో ఈ ఏడుగురికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరితో వీరు సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఏడుగురికి నోటీసులిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌తో పాటు ఆయన తండ్రి ఖుద్దూస్‌ను… అధికారులు విచారిస్తున్నారు. షాహిన్ నగర్‌లోని వీరి నివాసంలో జరిపిన సోదాల్లో మత గ్రంథాలు, అరబిక్‌ పుస్తకాలు, లాప్‌టాప్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఖదీర్‌ ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో పనిచేస్తూ ఐసిస్‌ సానుభూతి పరులకు సహకరించాడని NIA భావిస్తోంది. CRPC 41 A కింద ఖదీర్‌, అతని తండ్రికి నోటీసులు ఇచ్చిన అధికారులు… పలు అంశాలపై వారిని ప్రశ్నించారు. అధికారులు తమతో గౌరవప్రదంగానే ప్రవర్తించారని.. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ఖుద్దూస్‌ తెలిపారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -