కొత్త జంటలకు దిల్ రాజు బంపరాఫర్

తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది శ్రావణమాసంలో. ప్రతి రోజూ పండుగలానే ఉంటుంది ఈ నెల మొత్తం. ముఖ్యంగా ఈ మాసంలో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.

ఈ శ్రావణ మాసంలో కళ్యాణం జరుపుకుంటున్న జంటలకు మా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర బృందం ఆహ్వానం.

@actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer

టాలీవుడ్‌లో శ్రావణమాస సందడి శ్రీనివాస కళ్యాణంతో మొదలవనుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న శ్రీనివాస కళ్యాణం గురువారం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ ఈ మాసంలో పెళ్లిళ్లు చేసుకునేవారు చిత్ర యూనిట్‌కి శుభలేఖలు పంపితే కొత్త జంటకు పట్టు వస్త్రాలు పంపిస్తారట.

అంతేకాదండోయ్.. మీ జంట వారికి నచ్చితే మరికొన్ని స్పెషల్ గిప్ట్స్ కూడా ఉన్నాయట. ప్రత్యక్షంగా కలవడం కుదరకపోతే గిప్ట్ ప్యాక్ మీ ఇంటికే వస్తుందట. మరెందుకాలస్యం.. వెంటనే వెడ్డింగ్ కార్డ్ పంపించేయండి.