కృష్ణాజిల్లాలో స్టూడెంట్ కిడ్నాప్ కలకలం

student , kidnap

కృష్ణాజిల్లా నూజివీడులో స్కూలు విద్యార్థి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా ఎస్వీ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. చిన్నాగిరిపల్లి గొల్లగూడానికి చెందిన వీర్ల లీలా ప్రసాద్.. సోమవారం ఉదయం పదిన్నరకు పెన్ను కొనుక్కునేందుకు స్కూలు నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. విద్యార్థి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారిస్తున్నారు. విద్యార్థి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.