భర్త నోట్లో హిట్ కొట్టి భార్య చేసిన పని..

wife kills husband, wife, husband

రోజు తాగి వచ్చి వేధిస్తున్న భర్త ను హత్య చేసిందో భార్య. ఈ ఘటన హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్ జాన్ జయసింగ్‌ నగర్ లో జరిగింది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవిక బతుకుదెరువు కోసం కొంత కాలం కిందట హైదరాబాద్‌ వచ్చారు. అయితే పెళ్లయినప్పటి నుంచే వీరిద్ధరి మధ్య సఖ్యత లేదు. జగన్ రోజు తాగి వచ్చి భార్యను వేధించేవాడు. నిన్న రాత్రి కూడా ఇలాగే జరిగింది. దీంతో భర్త మద్యం మత్తులో ఉండగా.. అతని నోట్లో బొద్దింకల నిరోధానికి వాడే హిట్‌ కొట్టి హతమార్చింది. పోలీసులు దేవికను అదుపులోకి తీసుకున్నారు.