కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య

woman-commits-suicide-child-bhayander-railway-station

భర్త వేధింపులు భరించలేక మహిళ తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లా భాయందర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. నవఘడ్‌ ప్రాంతానికి చెందిన రాహుల్‌ పింటూ, రేణుక పింటూ(24) భార్యభర్తలు వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఆరోహి ఉంది. రాహుల్ పింటూ గతకొంత కాలంగా చెడువ్యసనాలకు బానిసై భార్యపిల్లల్ని వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో దంపతులిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దాంతో మనస్థాపం చెందిన రేణుక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తాను చనిపోతే కుమార్తె అనాధ అవుతుందేమోనని కుమార్తెను కూడా తన వెంట తీసుకెళ్లాలని అనుకుంది. భాయందర్‌ రైల్వే స్టేషన్‌ కు చేరుకొని నాల్గవ ఫ్లాట్ ఫామ్ పై వేచి ఉంది. ఇంతలో రైలు రాగానే ఒక్కసారిగా దూకేసింది. రైలు చక్రాల కిందపడి ఇద్దరు మరణించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బుల్లెట్‌ బండి కొనటానికి డబ్బులు తేవాలంటూ ఆమెను భర్త ఏడాదిగా హింసిస్తున్నాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని రేణుకా తండ్రి ఆరోపించారు. దాంతో రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.