దేవుడు రమ్మంటున్నాడు.. 6 రోజులు లీవ్ కావాలి.. ప్లీజ్ యాక్సెప్ట్..

ఆఫీస్‌కి రెగ్యులర్‌గా వస్తూ అవసరమైతే లీవ్ పెట్టడం పరిపాటి. కారణం కరెక్ట్‌గా ఉంటే బాస్ కూడా ఓకే చేస్తూ లీవ్ గ్రాంటెడ్ అంటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ 6 రోజుల లీవ్ అడిగాడు. ఆఫీసర్ కూడా ఓకే అన్నారు. మరి దాంట్లో న్యూస్ ఏముంది అంటే.. అదే కదా ట్విస్ట్… అందరిలా కడుపునొప్పో, కాలునొప్పో అని లీవ్ పెట్టలేదు.

కలలో శివుడు కనిపించాడు. స్వామి కమండలం చేతబట్టి ఉన్నారు. ఆయన చుట్టూ పాములు కూడా తిరుగుతున్నాయి. తనకు జలంతో అభిషేకం చేయడానికి హరిద్వార్ రమ్మని చెప్పారు. మరి మీరు లీవ్ ఇస్తే నేను వెళ్లి స్వామి వారి కోరిక నెరవేరుస్తాను అంటూ.. ఆరు రోజుల సెలవు కావాలని ఓ లెటర్ రాశాడు ఆఫీసర్‌కి కానిస్టేబుల్ వినోద్ కుమార్. ఎవరి నమ్మకాలు వారివి కాదనడం ఎందుకని వెంటనే లీవ్ లెటర్ మీద సైన్ పెట్టేశారు బాస్.

లీవ్ కోరిన వైనం, కారణం కాస్త వింతగా వుండేసరికి ఆ లెటర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉన్నతాధికారులు. అది కాస్తా చక్కర్లు కొడుతూ అందర్నీ ఆకర్షిస్తోంది.