కరుణతో నా అనుబంధం.. మాటల్లో చెప్పలేనిది: మోహన్‌బాబు

సంప్రదాయ కుటుంబంలో పుట్టినా ఆధునిక ఆదర్శభావాలు ఉన్న వ్యక్తిగా ఎదిగారు. చివరి వరకు వాటికే కట్టుబడి ఉన్నారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 8 వతరగతి వరకే చదువుకున్నా రాజకీయాలను ఔపోసాన పట్టారు. తమిళుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వందల రచనలు చేశారు. మంచి వక్త అనిపించుకున్నారు. ఆయన రచనలు మరెందరికో స్ఫూర్తినిచ్చాయి.

ఆయన మరణం తననెంతో బాధిస్తుందని కరుణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకుడిగా ఎదిగిన తీరు ఆదర్శనీయమన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఆయన చేతుల మీదుగా అవార్టు అందుకోవడం మరచిపోలేని మధురానుభూతి అని, దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నీడ, బంగారక్క చిత్రాలకు గాను కరుణ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.