హైకోర్టు తీర్పు.. కన్నీటి పర్యంతమైన కరుణానిధి కుటుంబ సభ్యులు

karunanidhi buried

చెన్నైలోని మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు పూర్తి చేయడంపై కోర్టులో వాదనలు ముగిసాయి. దాదాపు గంటన్నరపాటు కోర్టులో డీఎంకే లాయర్లు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి అంత్యక్రియలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీచ్‌లో స్మారక నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలో పిటిషన్లు వేసిన వారే.. ఆ వ్యాజ్యాల్ని వెనక్కి తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని ఈసందర్భంగా కోర్టు ప్రశ్నించింది.

ముందు నిబంధనల పేరు చెప్పి, తర్వాత ప్రజాహిత వ్యాజ్యాల ప్రస్తావన తెచ్చి.. అభ్యంతరం తెలపడంలో ఆంతర్యం ఏంటని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలు విన్న మద్రాస్ కోర్టు.. చివరికి కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే పూర్తి చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు రావడంతోనే స్టాలిన్‌, అళగిరి భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కరుణానిధికి జోహార్లు పలికారు. మిగతా కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు. కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -