అందుబాటులోకి ఎస్‌బీఐ మెప్యాడ్‌ స్వైపింగ్ మిషన్‌ సేవలు

sbi-mophed-swiping

డిజిటల్ చెల్లింపుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెప్యాడ్‌ స్వైపింగ్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ వరమహాలక్మి సిల్స్‌లో ఎస్‌బీఐ రూపొందించిన మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్ట్ డివైజ్‌ ను ఎస్‌బీఐ సీజీఎం స్వామినాథన్,వరమహాలక్మి ఛైర్మన్ ప్రసాద్‌లు ఆవిష్కరించారు. వినియోగదారులకు సులభ చెల్లింపులతో పాటు మొబైల్‌లోని SBI ఈ వ్యాలెట్‌ ద్వారా లావాదేవీలు కొనసాగించే అవకాశం ఉందని స్వామినాథన్ అన్నారు. వరమహాలక్మి సిల్క్‌తో పాటు ఎస్‌బీఐ రూపొందించిన మోప్యాడ్ స్వైపింగ్‌ మిషన్లను వినియోగిస్తామని ఎస్‌బీఐ తెలిపింది.