పాముతో సెల్ఫీ.. ప్రాణాలతో చెలగాటం..

పాము పేరు చెబితేనే భయంగా ఉంటుంది. అలాంటిది దగ్గరగా వెళ్లి ఫొటో దిగాలనుకుంటే మాత్రం దాని సహజ స్వభావాన్ని చూపిస్తుంది. అదృష్టం బావుండి పాము ఏ మూడ్‌లో ఉందో కానీ వారిని ఏమీ చేయలేదు. మనసులో మాత్రం నీకిదేం పిచ్చిరా బాబు.. నేను గనుక కాటేసాననుకో చచ్చి ఊరుకుంటావు అని అనుకునే ఉంటుంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రాజనాగం పాముతో సెల్ఫీదిగుతున్నారు కొందరు యువకులు.

 

చెట్టుపై ఉన్న పాముని పట్టుకుని సెల్ఫీలు తీసుకున్నారు. ఆనక ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో పోలీసులు ఆ వీరుల్ని పట్టుకున్నారు. వారు మణికంఠన్, రామానుజం, దినేష్ కుమార్, యుగేశ్వరన్, విఘ్నేష్ అనే ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఫుల్లుగా మద్యం తాగి ఆ మత్తులో వారు పాముతో ఫొటోలు దిగారని పోలీసుల విచారణలో తేలింది.