కరుణానిధి భౌతిక కాయాన్ని చూడటానికని వచ్చి ఇద్దరు మృతి

stampede-rajaji-hall-chennai

ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో చెన్నైలోని రాజాజీ హాల్‌ జనసంద్రంగా మారింది. తమ ప్రియతమ నేత చివరి చూపు కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భారీగా గుమిగుడారు.ఈ క్రమంలో అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి.