కరుణానిధి పచ్చని శాలువా, నళ్ల కళ్లద్దాల వెనక ఉన్న రహస్యం ఇదే!

ప్రజాకర్షక పథకాలతో తమిళుల మదిలో చెరగని ముద్ర వేసిన కలైంజ్ఞర్‌… లుక్స్‌ విషయంలో కూడా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. నల్ల కళ్లద్దాలతో, మెడలో పచ్చని శాలువాతో.. తనకంటూ ఓ స్టైల్‌ క్రియేట్‌ చేసుకున్నారు. తమిళనాట ఓ తరమంతా ఆయన్ను అనుకరించేలా బలమైన ముద్ర వేశారు.

కరుణానిధి.. ఈ పేరు తలుచుకోగానే గుర్తుకొచ్చేవి పుసుపురంగు శాలువా, నల్లకళ్లద్దాలు. తమిళనాట రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించిన కరుణ.. తన స్టైల్‌ను కూడా జనంలోకి అలాగే తీసుకువెళ్లారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన అదే స్టైల్‌ను కొనసాగించారు. ఆయన పసుపురంగు శాలువానే వేసుకోవడం వెనకా.. శాస్త్రీయ కారణమే ఉంది. కళ్లను సులువుగా ఆకర్షించే రంగుల్లో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఈజీగా గుర్తు పట్టొచ్చు. అందుకే కరుణ పసుపు రంగు శాలువా ధరిస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

తమిళనాట కరుణానిధి నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ స్టైల్‌ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడుకి ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణ.. ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు.

కరుణ సన్నిహితులు అసలు విషయం చెప్పేదాకా.. నళ్ల కళ్లద్దాల వెనక కథేంటో ఎవరికీ తెలియలేదు. 1960లో కరుణకు ప్రమాదం జరిగిందని.. ఆ ప్రమాదంలో ఆయన ఎడమ కన్నుకి గాయమైందని తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు అప్పటి నుంచి ఆయన నల్ల కళ్లద్దాలను ధరిస్తున్నారన్నారు. అలా 46 ఏళ్ల పాటు వాటిని ధరించిన ఆయన.. తర్వాత నల్ల కళ్లద్దాలను పక్కన పెట్టి వైట్ గాగుల్స్ ధరించడం ప్రారంభించారు. వాటిని జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారని.. చెన్నైలోని విజయ కంటి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరుణతో పాటు ఆయన ప్రాణస్నేహితుడు ఎంజీఆర్ కూడా నల్ల కళ్లద్దాలనే ధరించేవారు. వాటికి ఈ ఇద్దరూ తమిళనాట బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారంటే అతిశయోక్తి కాదు.

karunanidhi-puranas are not intrested

మరోవైపు కరుణానిధి గొప్ప రాజకీయవేత్త, సాహిత్యవేత్తగానే అందరికీ పరిచయం. కానీ ఆయన గొప్ప క్రీడాభిమాని అనే విషయం చాలామందికి తెలియదు. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానం. ఆయన అస్వస్థతకు గురి కావడానికి ముందు.. ముని మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన స్వగృహంలో వీల్‌ ఛైర్‌లోనే కూర్చొని మరీ క్రికెట్ ఆడారు. వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ ఆయన అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ పిల్లాడిని తికమక పెట్టేందుకు ఆయన కొన్ని స్పిన్ బాల్స్‌ని సంధించారు. మనవడు కూడా తాతకి దీటుగా బ్యాటింగ్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేసింది.