రోడ్డు ప్రమాదంలో ప్రముఖ క్రీడాకారుడు మృతి

Nicholas Bett has died in a car crash

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ అథ్లెట్ కోలస్‌ బెట్‌(28) మృతి చెందారు. నైజీరియాలో జరుగుతన్న ఆఫ్రికా హర్డల్స్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బెట్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.
వేగంగా వేళుతున్న బెట్‌ ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెట్‌ 400 మీటర్ల హర్డల్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించి 2015లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. చైనాలో జరిగిన షార్ట్‌ డిస్టెన్స్‌ హర్డల్స్‌ రేస్‌ విజేతగా నిలిచారు.