అమెరికాలో సిక్కు వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి

sikh man attacked

అమెరికాలో జాత్యహంకార దాడులు ఆగడం లేదు.. విదేశీయులను చూడగానే కొందరు స్థానికులు ఉన్మాదులుగా మారిపోతున్నారు. 71 ఏళ్ల.. ఓ సిక్కు వ్యక్తిపై స్థానిక పోలీస్‌ అధికారి కొడుకు థైరాన్‌ అలెక్స్‌, అతడి స్నేహితుడుతో కలిసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. వృద్ధుడు అని కూడా చూడకుండా యువకులు దాడికి పాల్పడ్డారు.

ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. గాయపడ్డ సిక్కు వ్యక్తి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ యూనియన్‌ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకును అరెస్ట్‌ చేయడానికి థైరాన్‌ అలిస్టర్‌ తండ్రి డారెల్‌ సహకరించాడు.