రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌‌గా హరివంశ్ నారాయణ్‌ సింగ్‌…

harivansh singh

డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ ఎన్నికయ్యారు.. రాజ్యసభలో జరిగిన ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి 125 ఓట్లు పడ్డాయి. ఊహించినదానికంటే ఎన్డీఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లే వచ్చాయి.. ఇక విపక్షాల అభ్యర్థి బి.కె.హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి.. ఇద్దరు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ ఎన్నికైనట్టు చైర్మన్‌ వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించారు.

అంతకముందు సభలో కాస్త గందరగోళం నెలకొంది. మొదట ఓటింగ్‌ నిర్వహించినప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి 115 ఓట్లు.. విపక్షాల అభ్యర్థికి 89 ఓట్లు పడ్డాయి. అయితే కొందరు ఓట్లు సరిగ్గా నమోదు కాలేదని చెప్పండంతో మరోసారి అధికారులు ఓటింగ్‌ నిర్వహించారు.. ఆ ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్థికి 122, విపక్షాల అభ్యర్థులకు 98 ఓట్లు పడ్డాయి.. ఇద్దరు గైర్హాజరయైనట్టు వచ్చింది. ఆ ఓటింగ్‌పైనా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. తమ ఓట్లు తప్పుగా పడుతున్నాయని కొందరు అభ్యంతరం చెప్పడంతో.. మళ్లీ కౌంట్‌ చేశారు.

సభ్యులను లెక్కించిన తరువాత.. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ సింగ్‌కు 125 ఓట్లు‌, విపక్షాల అభ్యర్థికి హరి ప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయని చైర్మన్‌ అధికారంగా ప్రకటించి ఓటింగ్‌ను ముగించారు.