అమ్మాయిని ట్యూషన్‌కి పంపి అమ్మానాన్న..

కష్టాలెన్నున్నా కలిసి పంచుకోవాల్సింది పోయి భార్యాభర్తలిద్దరూ తనువు చాలించారు. బిడ్డని అనాధను చేశారు. బెంగుళూరుకు చెందిన రాఘవేంద్ర, ఆరతి దంపతులు దత్తా కిరణా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఎనిమిదవ తరగతి చదువుతున్న రమ్య అనే కుమార్తె ఉంది. స్కూలు నించి వచ్చిన రమ్య డ్రస్ మార్చుకుని అమ్మ పెట్టిన టిఫిన్ తిని రోజులానే ట్యూషన్‌కి వెళ్లింది.

తిరిగి వచ్చి చూసేసరికి తల్లిదండ్రులిద్దరూ బెడ్‌రూమ్‌లో ఉన్న మంచంపై నిర్జీవంగా పడి ఉన్నారు. వారిని ఆ పరిస్థితిలో చూసేసరికి రమ్యకు నోట మాట రాలేదు. ఇరుగు పొరుగు వారిని పిలుచుకు వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ సూసైడ్ ‌నోట్ రాసిపెట్టి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వీరి ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.