
ధడక్ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన జాన్వీ కపూర్ మరో భారీ ఆఫర్‌ని సొంతం చేసుకుంది. అందంలో అమ్మ శ్రీదేవిని గుర్తుకు తెచ్చేలా ఉన్నా నటన ఎలా ఉంటుందో అని అనుమానపడేవారికి ధడక్‌తో సమాధానం చెప్పింది. మంచి మార్కులు కొట్టేసింది. దాంతో మరి కొంత మంది నిర్మాతలు క్యూ కట్టేసారు జాన్వీ ఇంటిముందు.
అలాంటిలాంటి చిత్రంలో కాదు ఓ భారీ చారిత్రక చిత్రంలో నటించే అవకాశం జాన్వీని వెతుక్కుంటూ వచ్చింది. సినిమాపేరు కూడా ఖరారైంది ‘తక్త్’ అని. సింహాసనం అని అర్థం వస్తుంది. రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నాడు. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో కరీనా కపూర్, అలియా భట్ కథానాయికలుగా కనిపించనున్నారు.