అమ్మాళ్‌ మెడలో తాళి కట్టేసమయంలో కరుణ మాయం

94 ఏళ్ల కరుణానిధి నిష్క్రమించారు. ఓ శకం ముగిసింది. ఆయన జీవితం ఓ పెద్ద గ్రంధం. పుస్తకంలోని ప్రతి పేజీ ఓ జీవిత పాఠం. మంచి చెడులు ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ మంచిని మాత్రమే చూస్తే రాజకీయ కురువృద్ధుడు దివంగత నేత కరుణానిధి నుంచి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తన ఆశయాలకు కట్టుబడి ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయని ధీశాలి. 1948 సెప్టెంబర్ 15న దయాళు అమ్మాళ్‌‌ని వివాహం చేసుకోబోతున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో హిందీ భాషకు వ్యతిరేకంగా ధర్నా జరుగుతోంది. నినాదాలు చేస్తూ కొంతమంది వ్యక్తులు అటుగా వెళుతున్నారు. అది విన్న కరుణ వివాహ వేడుకలో నుంచి మాయమయ్యారు. వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా ముగిసిన అనంతరం వచ్చి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు.