నటిని దారుణంగా హతమార్చిన భర్త

పాకిస్తాన్ చెందిన నటి,గాయని రేష్మ భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన పాక్‌లోని ఖైబర్‌ ఫంక్తుఖ్వాలో ప్రాంతంలో చోటుచేసుకుంది.భర్తతో విభేదాల కారణంగా రేష్మ గత కొన్నిరోజులుగా తన సోదరుని ఇంట్లో ఉంటున్నారు.దీంతొ ఆమెపై కక్ష పెంచుకున్న భర్త ఎలాగైనా రేష్మని చంపాలని పథకం రచించాడు.ప్లాన్‌ ప్రకారం ఆమె ఉంటున్నా నివాసానికి వెళ్లి ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రేష్మిపై దాదాపు 8 రౌండ్ల కాల్పులు జరిపాడు.దీంతో ఆమెకు బుల్లేట్ గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారిలో ఉన్న నిందుతుడి కోసం గాలిస్తున్నారు.