రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఒక మంచి జర్నలిస్ట్

harivansh narayan, deputy chaiman

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్ధిగా పోటీచేసిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. 2014 లో రాజ్యసభకు నామినేట్ అయిన హరివంశ్ పెద్దల సభకు నామినేట్ అయిన తొలిసారే ఈ కీలకపదవి చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. హెమాహెమీలుండే రాజ్యసభను ఆయన నడిపించనున్నారు. హరివంశ్ కు రాజకీయ నేపథ్యం కూడా తక్కువే.

ప్రముఖ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ పుట్టిన సరన్ జిల్లా సితీబ్ డయారా గ్రామంలోనే హరివంశ్ నారాయణ్ సింగ్ పుట్టారు. 1956 జూన్ 30న పెట్టిన హరి.. బనారస్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యూయేట్ చేశారు. ఎకనామిక్స్ లో పట్టా తీసుకున్న ఆయన.. జర్నలిజంలో అడుగుపెట్టారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేశారు. అయితే ఉద్యోగం ఆయనకు నచ్చక.. మళ్లీ జర్నలిజంలోకి వచ్చారు. బ్యాంకులో ఉన్నతస్థాయిలో పనిచేసే అవకాశం వచ్చినా.. రూరల్ జర్నలిజంపై ఆసక్తితో వెనక్కు వచ్చారు.

రాంచి నుంచి వెలువడే ప్రభాత్ కబర్ పత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్న సమయంలో అప్పట్లో మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఆహ్వానించడంతో ఆయనకు సలహాదారుగా వ్యవహరించారు. చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోవడంతో మళ్లీ పత్రిక ఎడిటర్ గా వచ్చి చేరారు. 1989 నుంచి 2014 వరకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించారు. రాజ్యసభక నామినేట్ కావడంతో ఎడిటర్ పదవికి రాజీనామా చేశారు. చంద్రశేఖర్ వద్ద సలహాదారుగా ఉన్నప్పుడు నితీశ్ కుమార్ వంటి వారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. తర్వాత కాలంలో జేడీయూ ప్రభుత్వం చేసిన మంచి పనులను తన పత్రిక ద్వారా ప్రచారం కల్పించారు. పనితీరు బాగాలేకపోతే విమర్శలు గుప్పించారు. ఈ ముక్కుసూటితనం నితీశ్ కు మరింత దగ్గర చేసింది. అందుకే నితీశ్ ఆయనకు పట్టబట్టి రాజ్యసభ ఇప్పించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ పదవి కూడా వచ్చేలా చేశారు.