ప్రేమించిన యువతితో స్నేహితుడు పరార్.. విద్యార్థి సెల్ఫీ సూసైడ్

selphy suicide in machanpalli srikant

మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా నాపై ఆశలు వదులుకో.. నా స్నేహితుడే నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలియజేసి ప్రాణాలు తీసుకున్నాడు. మాచన్ పల్లికి చెందిన శ్రీకాంత్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు అంజి.. ప్రేమించిన యువతితో పరారయ్యాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు అన్ని విషయాలు శ్రీకాంత్ కు తెలుసంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు అతనికేమీ తెలియదని వదిలిపెట్టారు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్.. సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డుచేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఏ పాపం తెలియదని వేడుకున్నాడు. ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఉన్న రైల్వే పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు.