‘శ్రీనివాస కళ్యాణం‌’ మూవీ రివ్యూ

srinivasa-kalyanam-telugu-movie-review

శతమానంభవతి తో కాలం వేగంలో పడి మర్చిపోతున్న తల్లిదండ్రుల బంధాలను గుర్తు చేసిన సతీష్ వేగ్నేశ ఈ సారి పెళ్ళి చుట్టూ అల్లుకున్న సంప్రదాయాలను, వాటి విలువలను కథ వస్తువుగా మలిచి శ్రీనివాస కళ్యాణం చేశాడు. మరి కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం..

కథ:
ఉమ్మడి కుంటుంబంలో పెరిగిన శ్రీనివాస్(నితిన్) ఆర్కిటెక్చర్ గా చంఢీఘర్ లో పనిచేస్తుంటాడు. అక్కడ శ్రీదేవి( రాశీఖన్నా) ను ప్రేమిస్తాడు. ఒక సాధారణ అమ్మాయిగా పరిచయం అయిన శ్రీదేవి హైదరాబాద్ లో ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత( ప్రకాష్ రాజ్) కూతురు. తన ప్రేమ విషయం చెప్పి శ్రీదేవి తండ్రిని ఒప్పిస్తాడు. అయితే తన కూతురు తో పెళ్ళి కి ముందు ఒక అగ్రిమెంట్ పెడతాడు ప్రకాష్ రాజ్. ఆ విషయం ఇంట్లో దాచి పెళ్ళికి సిద్ద పడతాడు శ్రీనివాస్. అయితే పెళ్ళి మాత్రం సంప్రదాయాల ప్రకారం జరగాలని కండీషన్ పెడతాడు. ఆ కండీషన్ కి ఒప్పుకుంటాడు ఆర్కే. సంప్రదాయాలకు విలువ నిచ్చే ఉమ్మడి కుంటంబంతో ప్రతిదీ బిజినెస్ లా చూసే ఆర్కే కుదుర్చుకున్న పెళ్ళి ఎలా జరిగింది ..? అనేది మిగిలిన కథ..?

కథనం:
సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం, ప్రజల ఆలోచనలలో మార్పులు తేగల శక్తి సినిమాకి ఉంది. అయితే ఏదయినా మంచి విషయాలు చెప్పాలనుకున్నప్పుడు అవి ఏ మోతాదులో ఉండాలి అనే విషయంలో నియామాలు పాటించాలి. లేదంటే ఎక్కువైన తేన కూడా ఏవగింపలే తెస్తుంది. శ్రీనివాస కళ్యాణం విషయంలో సతీష్ పాటించని నియమాలు ఇవే. నితిన్ క్యారెక్టర్ పరిచయం అయిన దగ్గరనుండి అతని నోటి నుండి మాటలు రాలేదు కోటేషన్స్ వచ్చాయి. అవి ఒక సారో కొన్నిసార్లో అయితే పర్లేదు కానీ సినిమా అంతా అంటే మాత్రం భరిచడం కష్టం. హీరో మంచితనం చూసి హీరోయిన్ అతనికి ఇంప్రెస్ అయి ప్రేమలో పడంది.. ఆమె ఇంప్రెస్ అవ్వడం రీపీట్ అయ్యే సరికి ఆ ప్రేమకథ మీద ప్రేక్షకులకు బోర్ కొట్టింది. రాశీ ఖన్నా, నితిన్ మద్య కెమిస్ట్రీని పండించే సన్నివేశాలు కానీ, పెంచే విషయాలు కానీ అసలు ఏమీలేవు. ప్రతిదీ బిజినెస్ లా చూసే ఒక మిలినియర్ అడగ్గానే కూతర్ని ఇచ్చేందుకు అంత తెలిగ్గా ఒప్పుకోవడం ఏంటా అనే ఆలోచన తొలుస్తూనే ఉంది. ఇంకా ప్రకాష్ రాజ్ సంప్రదాయాలను అంతగా విరక్తి కలగడానికి కారణం ఏంటో అవసరం అయినా ఆయన ఇచ్చిన హావభావాలు మాత్రం అంతగా విసుక్కోవడానికి ఏముంది అనిపిస్తుంది. ఇక ఈ ప్రేమకథలో పాటలు మరింత దారుణంగా మారాయి. హీరో, హీరోయిన్స్ మద్య ప్రేమ ఎలివేట్ అవదు. హీరోయిన్ తండ్రి పడే చిరాకు అర్దం అవదు.ఇలా ఫస్ట్ హాఫ్ ముగిస్తే ఇక పెళ్లి తంతు మొదలయ్యే సరికి సతీష్ ఒక పాఠం చెప్పడానికి సిద్ద పడినట్లు అనిపించింది. ఆ పాఠం చెప్పే బాధ్యత ఎక్కువగా నితిన్ తీసుకున్నాడు. సంప్రదాయాలు వదలకూడదు. ఈ మాట పదే పదే వినిపించి విసుగు తెప్పించింది. పెళ్ళి లో చేసే క్రతువులు చేసే క్రమంలో తండ్రిగా మారడం మొదలవుతుంది. సంప్రదాయాలకు పెద్దగా విలువ ఇవ్వని తండ్రి ని మార్చేందుకు అల్లుడు చేసే ప్రయత్నంగా ఈ కథనం సాగుతుంది. ఇక నందితా శ్వేత పాత్ర చాలా పేలవంగా మారింది. చిన్నప్పటినుండి బావను ఇష్టపడే మరదలు పాత్ర కథకు ఎక్కడానే చిక్కుముడి వేస్తుందేమో అనుకుంటే అది కూడా తేలిపోయింది. జరుగుతున్న కథ ఆసక్తిగా మారాలంటే ఆ కథలో ఏదైనా ప్రతిబంధకాలుండాలి. అవి హీరో ఎలా దాటుతాడా అనే ఆసక్తిని కలిగించాలి. కానీ శ్రీనివాసుడి పెళ్లిలో అలాంటి వేమీ లేవు. కేవలం ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ద్వారా మాత్రమే ఒక సమస్యను ముందు ఉంచాడు కానీ కథ చివరికి ఎలా ముగుస్తుందో క్లైమాక్స్ కి ముందు నుండే అర్ధం అవుతుంది.

నితిన్ ఒక మంచి కుర్రాడిగా సినిమా అంతా కనిపిస్తాడు. ప్రతి వారిని వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించే క్యారెక్టర్ ని హీరో గా మలిచిని దర్శకుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ని మాత్రం మరిచిపోయాడు. ఇక జయసుధ, రాజేంద్ర ప్రసాద్, ఆమని, నరేష్ పాత్రలు సరదాగా, హుందాగా ఉన్నాయి. పెళ్ళి అనే కాన్సెప్ట్ ను తీసుకొని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఒక పాటలో చెప్పవచ్చు. కానీ అందుకోసం అతను చెప్పిన కథ మాత్రం ఆసక్తిగా సాగలేదు. పెళ్లి నిలబడాలంటే ఒకరిమీద ఒకరికి చెక్కు చెదరని నమ్మకం పునాది అవుతుంది . ఈ చిన్న పాయింట్ ని మిస్ అయ్యాడు. మిక్కి మీ జేయర్ స్వరాలు పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పెళ్ళి లో జరిగే సరదా సన్నివేశాలు కూడా సినిమాలో కనిపించవు. సంప్రదాయాలకు సరాదాలు అడ్డు వస్తాయిని అనుకన్నాడనిపిస్తుంది. రాశిఖన్నా, నితిన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. చెప్పాలనుకున్న విషయంలో ఎంత సీరియస్ నెస్ ఉన్నా చెప్పే విధానం తేలికగా ఉండాలి. సినిమా కథకు ఇవి చాలా అవసరంగా మారతాయి అవిలేని శ్రీనివాసుడి కళ్యాణం బలవంతపు పెళ్ళిగా అనిపించింది.

చివరిగా:
బలవంతపు పెళ్ళి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.