సమయస్ఫూర్తితో చిన్నారి ప్రాణాలను కాపాడిన పోలీసులు

చికెన్ నగెట్ గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోలేక ఇబ్బందిపడుతున్న ఓ చిన్నారిని ఇద్దరు పోలీసులు సమయస్పూర్తితో కాపాడారుఈ సంఘటన ఫ్లోరిడాలోని ఓ మాల్‌లో చోటుచేసుకుంది. అనా గ్రాహం అనే మహిళ తన కూతురు లూసియాతో కలిసి ఫ్లోరిడాలోని గార్డెన్‌ మాల్‌కు వెళ్ళింది. లూసియాకు ఆహారం తినిపిస్తున్న సమయంలో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడింది. చిన్నారి పరిస్థితిని అర్థం చేసుకున్న అనా గ్రాహం కాపాడాలంటూ ఏడుస్తూ గట్టిగా అరిచింది.ఆమె ఆర్తనాదాలు విన్న ఇధ్దరు పోలీసులు రాబర్ట్‌ అయాల, రఫెల్‌ గడాలుప్‌లు అక్కడకు చేరుకొని చిన్నారిని రక్షించారు.లూసియాను దగ్గరకు తీసుకున్న పోలీస్ ఆఫీసర్ తలకిందులుగా పడుకోబెట్టి మరో చేతితో వీపుపై చరుస్తూ ఒత్తిడి తీసుకువచ్చారు.వెంటనే చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఆహారం బటయకు వచ్చింది. దీంతో అనా గ్రాహం ఊపిరిపీల్చుకుంది తన బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనా పోలీసులకు లేఖ రాసింది. తన పాపను కాపాడడానికి స్వర్గం నుంచి అద్భుత శక్తులు వచ్చాయని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపను కాపాడిన పోలీసులకు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. వీరు చేసిన సాహసాన్ని గుర్తించిన ది పామ్‌ బీచ్‌ గార్డెన్‌ సిటీ కౌన్సెల్‌ ఇద్దరు పోలీసులను లైఫ్‌ సేవింగ్‌ అవార్డుకు ఎంపికచేసింది.