విజయవాడలో నకిలీ 100 రూపాయల నోట్లు..

fake notes

నకిలీ 100 రూపాయల నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. కంప్యూటర్, ప్రింటర్ సాయంతో ఒరిజనల్ 100 నోటును స్కాన్ చేసి.. డూప్లికేట్స్ ప్రింట్స్ తీస్తూ వాటిని మార్కెట్‌లో తెలివిగా చెలామణీ చేస్తున్నారు.

వీళ్ల నకిలీ దందాపై పక్కా సమాచారం అందడంతో పటమట పోలీసులు దాడి చేసి.. ఎకికేపాడుకు చెందిన షేక్ భిశంసతోపాటు చందర్లపాడుకు చెందిన షేక్ జానీ, సుభానీలను అరెస్టు చేశారు. ఏడాది కాలంగా వీళ్లు ఇలా నోట్లు మారుస్తున్నట్టు గుర్తించారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.