వృద్ధురాలిని చూస్తూ యువకుడి వికృత చర్య

woman-shoots-man-masturbating-her-doorstep-texas

వృద్ధురాలిని వెంబడిస్తూ వికృత చర్యకు పాల్పడ్డాడో వ్యక్తి. అతడి చర్యను భరించలేని వృద్ధురాలు యువకుడిపై కాల్పులు జరిపింది.ఈ ఘటన అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్‌ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 68 ఏళ్ల గ్రానీ జీన్‌ అనే వృద్ధురాలు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో ఓ వ్యక్తి సైకిల్‌పై ఆమెను వెంబడించాడు. కాస్త దూరం వెళ్లాక ప్యాంట్‌ విప్పి ఆమెను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అయితే ఆమె భయంతో ఇంటికి పరుగులు తీసింది. అయినా ఆ వ్యక్తి ఆగకుండా ఆమెను వెంబడించాడు. చివరకు ఆమె తన ఇంటికి చేరుకొని తలుపులు వేసుకుని లోపల ఉన్నా కూడా అతను వికృత చేష్టలు ఆపకుండా ఉన్నాడు. పైగా అతను ఇంట్లో రావడానికి ప్రయత్నించగా ఆమె తన తుపాకీతో అతడిపై కాల్పులు జరిపింది. గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్నాక అతన్ని అరెస్ట్‌ చేస్తామని అధికారి ‘ల్యారీ క్రౌసన్‌’ వెల్లడించాడు. గతంలో కూడా అతను నగ్నంగా రోడ్లపై తిరగడంతో అరెస్ట్‌ చేసినట్లుగా వినికిడి.