రైతు బీమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష

cm-kcr

రైతు బీమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆగస్ట్‌ 15 తర్వాత రైతు ఏ కారణంతో చనిపోయినా బీమా వర్తిస్తుందని ఆయన చెప్పారు. రైతు మృతి చెందిన 10 రోజుల్లో నామినీకి ఎల్‌ఐసీ 5 లక్షలు చెల్లిస్తుందన్నారు. 48 గంటల్లో డెత్‌ సర్టిఫికెట్‌ ఇప్పించే బాధ్యత గ్రామకార్యదర్శిదని కేసీఆర్ స్పష్టం చేశారు. చెక్కు జారీలో తలెత్తే సమస్యలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి పరిష్కరించాలన్నారు.

పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందిస్తామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ప్రగతి భవన్ వచ్చిన పద్మశాలీ సంఘం ప్రముఖులతో కేసీఆర్ మావేశమయ్యారు. పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి పరిష్కార మార్గాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం, 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, దానికోసం మొదటి విరాళంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి 50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చేనేత, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని సీఎం చెప్పారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలను, ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి, మార్కెటింగ్ సమస్య రాకుండా చేస్తున్నదన్నారు. మరమగ్గాలను వందకు వంద శాతం ప్రభుత్వ నిధులతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. నూలు, రసాయలనాలపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నామని కేసీఆర్‌ గుర్తు చేశారు.

-ADVT-