ఎమ్మెల్యే బోండా ఉమ అధికార దుర్వినియోగం..

mla-bonda-uma-abuse-of-power

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు… సింగ్‌ నగర్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మిస్తున్న భవనానికి ఏకంగా టీడీపీ కార్యకర్త పేరు పెట్టారు… విజయవాడ కార్పొరేషన్‌ కౌన్సిల్‌లో ఆమోదించకుండానే ఎమ్మెల్యే తన అనుచరుల పేరు పెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు… ఎమ్మెల్యే ఏమైనా తన సొంత నిధులతో కడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు… అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.