దావానంలా వ్యాపిస్తున్న కాలిఫోర్నియా కార్చిచ్చు

more-evacuations-called-as-southern-california-fire

అమెరికాలోని కాలిఫోర్నియాలో రాష్ట్రంలో ఏర్పడిన కార్చిచ్చు రోజురోజుకు దావానలంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు లక్షా 87వేల ఎకరాల అడవీ ప్రాంతాన్ని అగ్నికీలలు దగ్దం చేశాయని అమెరికా జాతీయ అగ్నిమాపక సంస్థ వెల్లడించింది. మెండోసినో కాంప్లెక్స్ ఫైర్ గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు దక్షిణ కాలిఫోర్నియా వైపు దూసుకొస్తోంది. దీంతో 20వేల మందిని ఖాళీచేయించి సురక్షితప్రాంతాలకు తరలించారు. దీనికి తోడు పశ్చిమ ప్రాంతాల్లోని 15 రాష్ట్రాల్లోసైతం మంటలు వ్యాపించాయని నాసా ఫోటోలను విడుదలచేసింది. సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారిచేశారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలకు తోడు దట్టంగా పొగ కమ్మెయ్యడంతో ఎయిర్ క్వాలిటీ అలెర్ట్ ను విధించి అప్రమత్తంచేశారు. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అతిపెద్దం ప్రమాదమని అధికారులు వెల్లడించారు. 14వందలమంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.