లార్డ్స్ టెస్టును వెంటాడుతున్న వరుణుడు

James Anderson dismissed both India openers on Day 2
James Anderson dismissed both India openers on Day 2

లార్డ్స్ టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. తొలిరోజు ఆట పూర్తిగా రద్దవగా… రెండోరోజు వరుణుడు అరగంట సేపు కరుణించడంతో మ్యాచ్ ఆరంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మొదటి ఓవర్లలోనే మురళీ విజయ్ డకౌటవగా… కెఎల్ రాహుల్ 8 పరుగులకు ఔటయ్యాడు. స్కోర్ 11 పరుగుల దగ్గర ఉండగా.. వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. తుది జట్టులో ధావన్,ఉమేశ్ యాదవ్‌లను తప్పించి పుజారా, కుల్దీప్‌యాదవ్‌లను తీసుకుంది.