దగ్గరపడుతున్న డెలివరీ డేట్.. నా వల్ల కావడం లేదంటున్న సానియా!

sania ,mirza, tennis

త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సానియా మీర్జా.. డెలివరీ డేట్ దగ్గరపడుతున్నా టెన్నిస్‌ ఆడడం ఆపలేదు. కేవలం ఎక్సర్సైజ్ కోసం మాత్రమే కాదు.. టెన్నిస్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనమంటోంది. ప్రస్తుతం ఆమె 7నెలల గర్భిణి. తాజాగా, తన సోదరి ఆనమ్‌ మీర్జాతో కలిసి టెన్నిస్‌ ఆడుతున్న వీడియోను సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

టెన్నిస్‌కు దూరంగా ఉండడం తన వల్ల కావడం లేదని సానియా అంటోంది. కోర్టుకు ప్లేయర్‌ని కొన్నాళ్లపాటు దూరం చెయ్యొచ్చేమో కానీ, టెన్నిస్‌ను వాళ్ల నుంచి దూరం చేయలేరని చెప్తూ మెసేజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. “మామ్‌ సానియా ఈజ్‌ బ్యాక్‌” అంటూ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు చెప్తున్నారు.