స్టేషన్‌కి వచ్చిన అనుకోని అతిధి.. పోలీసులు షాక్

James Anderson dismissed both India openers on Day 2
James Anderson dismissed both India openers on Day 2

ఈ మధ్య పాములు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వంటగదిలోకి, బెడ్‌రూమ్‌లోకి కూడా వచ్చేసి మనుషుల్ని భయపెడుతున్నాయి. కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్ నగరంలోని జనం రద్దీగా ఉండే ప్రాంతమైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లోకి ఎక్కడ్నించో ఓ పైథాన్ వచ్చింది.

స్టేషన్ బయట కనిపించిన పైథాన్‌ని చూసి సెక్యూరిటీ సిబ్బంది కంగారు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌ని పిలిపించారు. ఆయనకు పాములు పట్టడంలో అనుభవం వుండడంతో నేర్పుగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని జూపార్కుకు తరలించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -