రవిశాస్త్రి డెలివరీకి సిద్ధంగా ఉన్నాడంటూ…

ravi-shastris-pot-belly-becomes-pot-all-jokes-twitter

భారత క్రికెట్‌ కోచ్‌ రవిశాస్త్రికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు రవిశాస్త్రిపై జోకులు పేలుస్తున్నారు.భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్టులో భాగంగా గ్రౌండ్‌లో నిలుచున్న రవిశాస్త్రి పొట్టను చూపిస్తూ నెటిజన్లు కామెడీ పండించేస్తున్నారు.కోచ్‌‌గా మారిన తర్వాత రవిశాస్త్రి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం లేదు. ఆటగాళ్లు ఫిట్‌‌గా ఉండాలని చేప్పే శాస్త్రి తాను మాత్రం శరీరం మీద బ్యాలెన్స్ కోల్పోయాడు.కోచ్ డెలివరీకి సిద్ధంగా ఉన్నాడంటూ కొందరు జోకులు వేస్తున్నారు. పొట్ట పెంచడం నేరమీమీ కాదు కానీ డైటింగ్ చేయాల్సిన అవసరం ఉందని మరొకరు ట్వీట్ చేశారు.
ఇలా చిత్రవిచిత్రమైన కామెంట్లతో రవిశాస్త్రి పొట్టపైన అభిమానులు పోస్టులు పెడుతున్నారు.ఇంగ్లండ్‌ టూర్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో అభిమానులు కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.